

అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను వణికించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వాయుగుండంగా ఉన్న వ్యవస్థ ఈ ఉదయం తుఫానుగా మారనుందని, రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. బుధవారం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు కూడా పొంచి ఉందని సూచించింది.
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు గోదావరి జిల్లాలతో పాటు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!