

శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా మంగళవారం భ్రమరాంబికాదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు, అమ్మవారు నందివాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
నందివాహనంపై స్వామివారు, అమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం జమ్మి వృక్షం వద్ద శమీ పూజలు నిర్వహిస్తారు. రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీ స్వామివారు, అమ్మవార్ల తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి. విజయదశమి వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!