
రాజకీయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌ను రేపు, ఎల్లుండి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రకటించింది. రేపు పార్క్‌లో సీజేపీ ఆధ్వర్యంలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్క్‌లోకి ప్రజల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
మార్చ్ నేపథ్యంలో భద్రత, నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కనాట్ ప్లేస్‌కు వచ్చే సందర్శకులు, స్థానిక ప్రజలు ఈ రెండు రోజుల పాటు సెంట్రల్ పార్క్‌ను సందర్శించలేరు. పార్క్ తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై ప్రజలు ఎన్డీఎంసీ ప్రకటనలను గమనించాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!