
సినిమాలు

విజయవాడ శివార్లలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు మొత్తం విలువ సుమారు రూ.5.84 కోట్లుగా అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
తనిఖీల్లో భాగంగా అధికారులు ఒక స్కార్పియో వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఈ క్రమంలో వాహనంలోని రహస్య అరలో బంగారంతో పాటు 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు లభించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీకి సంబంధించిన వివరాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!