
షోస్

హైదరాబాద్లోని బాచుపల్లి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరిని ఈగల్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 5.83 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్తో పాటు రెండు ఐఫోన్లు, పాకెట్ వెయింగ్ మెషీన్ను కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల వివరాలను కూడా ఈగల్ ఫోర్స్ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. నిందితులకు మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి అందుతున్నాయి, వాటిని ఎవరికి విక్రయిస్తున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!