19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

Writer: Harika S 10:43 AM, 19 అక్టోబర్, 2026
ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. యాసంగి సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాయితీపై విత్తనాల పంపిణీకి రూ.224 కోట్లు, ఉద్యాన పంటల ప్రోత్సాహం, విస్తరణకు రూ.296.88 కోట్లు అవసరమని శాఖ సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.

వానాకాలంలో వర్షాభావం కారణంగా విత్తనాలు వేయడంలో ఆలస్యం, నేలలో తేమ తగ్గడం, మొక్కల పెరుగుదల మందగించడం, దిగుబడులు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నివేదిక హెచ్చరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాలని సూచించింది. నీటి పొదుపు కోసం మల్చింగ్, వ్యవసాయ కుంటలు, వర్షపు నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. రైతు మేళాలు, గ్రామసభల ద్వారా ఎల్‌నినో ప్రభావంపై చైతన్యం తీసుకురావాలని ప్రతిపాదించారు. భూగర్భ జలాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయ చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే వర్షపాతం లోటు నమోదవుతున్న ప్రాంతాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించారు. సబ్సిడీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక సలహాలు సకాలంలో అందితే రైతుల నష్టాలను తగ్గించడంతో పాటు నీటి వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

ట్యాగ్లు
తెలంగాణ వ్యవసాయంఎల్‌నినోయాసంగి పంటలురాయితీ విత్తనాలుఉద్యాన పంటలునీటి సంరక్షణరైతులకు ప్రోత్సాహం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌
సినిమాలు

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు
జనరల్

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?
జనరల్

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం
సినిమాలు

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
జనరల్

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి
సినిమాలు

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!