24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

Writer: G.Sreekanth Reddy 01:52 PM, 24 అక్టోబర్, 2026
ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

కేంద్ర ఎన్నికల సంఘంలో కీలక అధికారి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్లు స్వయంగా కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఎన్నికల సంఘంలో జోక్యం చేసుకుంటున్నట్టు అవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో జరిగిన ఈ అంశానికి సంబంధించి సామాజిక ఉద్యమకారుడు లోకేశ్‌ కె బాత్రా దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు తాజాగా అందిన సమాధానంలో ఈ వివరాలు బయటికి వచ్చాయి.

ఈ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు ఎన్నికల సంఘం పరిపాలన విభాగం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ భానుప్రకాశ్‌ సెలవుపై వెళ్లారు. దానితో సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ మనీశ్‌గార్గ్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. మనీశ్‌ గార్గ్‌ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. ఎన్నికల సంఘంలో పని విభజనకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి తీసుకోకుండానే, ఎలాంటి సమాచారం లేకుండానే పలు ఉత్తర్వులు జారీ చేశారని..ఆయనపై చర్యలు తీసుకోవాలని జూలై 29న కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌, వివేక్‌ జోషి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

ఆ లేఖలపై ఆగస్టు 3, 4 తేదీల్లో కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో అంతర్గత చర్చ జరిగింది. 3వ తేదీన జరిగిన చర్చలో ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అభిప్రాయం కోరాలని కేబినెట్‌ సెక్రటేరియట్‌ అధికారులు నిర్ణయించారు. అయితే 4న రూపొందించి, కేంద్ర సిబ్బంది శాఖ(డీవోపీటీ)కు పంపిన నోట్‌లో మాత్రం..‘‘డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్లు కోరారు. అవి వ్యక్తిగతంగా రాసిన లేఖలు. వాటిని తీవ్రంగా పరిశీలించాల్సి ఉన్నా.. అధికారికంగా పూర్తి ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ఫిర్యాదుగా పరిగణించలేం. చర్యలు చేపడితే ఎన్నికల కమిషన్‌ కార్యకలాపాల్లో జోక్యంగా భావించే అవకాశమూ ఉంది’’ అని పేర్కొన్నారు. మనీశ్‌గార్గ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఫిర్యాదులను, కేబినెట్‌ సెక్రటేరియట్‌ నోట్‌ను సీఈసీకి, డీవోపీటికి పంపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

ట్యాగ్లు
ఈసీఎన్నికల సంఘంసీఈసీకేంద్రంకేబినెట్ సెక్రటరీఆర్టీఐడీవోపీటీఎన్నికల కమిషనర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
జనరల్

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
జనరల్

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!