19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చీరాలలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి పద్మావతి

Writer: Harika S 12:19 PM, 19 అక్టోబర్, 2026
చీరాలలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి పద్మావతి

బాపట్ల జిల్లాకు స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా నియమితులైన ఎ.ఎ.ఎల్. పద్మావతి చీరాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ డానియల్ ఆమెకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ, సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న విధులపై పద్మావతి ఆరా తీశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన విద్యుత్ దీపాలు, మంచినీటి సదుపాయం, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై చీరాల డీఎస్పీ ఎం.డి. మోయున్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ డానియల్, డీఎస్పీ ఎం.డి. మోయున్, తహసీల్దార్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

మెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

మెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు

ప్రత్యక్ష ప్రసారంలో విషాదం.. ఫాదర్‌పై పడిన భారీ శిలువ

ప్రత్యక్ష ప్రసారంలో విషాదం.. ఫాదర్‌పై పడిన భారీ శిలువ

నాయిడివాడలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నాయిడివాడలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

రైతులకు పూల సాగుతో లాభాల బాట.. లిల్లీ పంటకు రూ.40 వేల వరకు సబ్సిడీ!

రైతులకు పూల సాగుతో లాభాల బాట.. లిల్లీ పంటకు రూ.40 వేల వరకు సబ్సిడీ!

ట్యాగ్లు
చీరాల వార్తలుబాపట్ల జిల్లాస్థానిక సంస్థల ఎన్నికలుఎన్నికల పర్యవేక్షణ అధికారిపద్మావతిఎన్నికల ఏర్పాట్లుపోలింగ్ కేంద్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు
సినిమాలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..
జనరల్

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ టాప్
బిజినెస్

మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ టాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!
జనరల్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

అమెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
జనరల్

అమెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు
జనరల్

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!