

ఆంధ్రప్రదేశ్‌లో 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులు, పత్రాలు, ఇతర ఆధారాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది.
ప్రధానంగా శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల అంశంపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారుల నివేదికలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. నామినేషన్ల గడువును పొడిగించాలని నిర్ణయిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించి, నామినేషన్ల గడువును పొడిగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!