

సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రముఖులు, సంస్థల పేర్లను ఉపయోగించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సీజేపీ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఖాతాలను పోలి ఉండేలా నకిలీ ప్రొఫైళ్లను రూపొందించి, సామాజిక సేవ, అత్యవసర వైద్య సహాయం పేరుతో ప్రజలకు సందేశాలు పంపుతూ విరాళాలు కోరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి.
తన పేరుతో, పార్టీ పేరుతో కొనసాగుతున్న నకిలీ ఖాతాలకు తనకు గానీ, తన ప్రతినిధులకు గానీ ఎలాంటి సంబంధం లేదని అభిజిత్ దీప్కే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇలాంటి సందేశాలను నమ్మి డబ్బులు పంపవద్దని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖులు లేదా సంస్థల పేరుతో ఎవరైనా డబ్బులు, విరాళాలు కోరితే ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల అధికారిక వెబ్‌సైట్లు, ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే స్పందించాలని, అనుమానాస్పద ఖాతాలకు వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని అందించవద్దని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!