17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

Writer: Pooja 06:41 AM, 17 అక్టోబర్, 2026
పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీకి తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంట నుంచి గంటన్నర వరకు వేచి చూడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, పండుగ రద్దీ పేరుతో టికెట్‌ ధరలు 50 శాతం పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రూ.300 ఉండే టికెట్‌ ధర రూ.450 వరకు పెరిగిందని చెబుతున్నారు. మరోవైపు, కూకట్‌పల్లి, సంజీవరెడ్డినగర్‌, అమీర్‌పేట ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు రద్దీని బట్టి సాధారణ ధరలకు రెండింతలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం జూబ్లీ బస్టాండులో ప్రయాణికుల రద్దీ, ఏర్పాట్లను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పరిశీలించారు. బస్టాండ్‌లో తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి వసతులను తనిఖీ చేసి, ప్రయాణికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని, సమాచారం కోసం 040-69440000, 040-23450033 హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరోవైపు, సొంత వాహనాలు, ప్రైవేట్‌ బస్సుల్లో ప్రజలు పెద్దఎత్తున ప్రయాణించడంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల కారణంగా వాహనాలను సర్వీస్‌ రోడ్లపైకి మళ్లించారు. ఈ రహదారులు ఇరుకుగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదిలి, కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద కూడా రద్దీ ఏర్పడింది. ఫాస్టాగ్‌ స్కానర్లలో సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

ట్యాగ్లు
బతుకమ్మదసరా పండుగహైదరాబాద్‌ రద్దీఆర్టీసీ బస్సులుటికెట్‌ ధరలువిజయవాడ జాతీయ రహదారి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ
జనరల్

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!