
జనరల్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ నిర్ణయం ప్రకటించింది. నిర్ణయించిన గడువులోగా వివరణ ఇవ్వకపోతే ఆయనతో చేసే ఏ సినిమా అయినా దేశవ్యాప్తంగా ఉన్న 23 క్రాఫ్ట్ యూనియన్లు పనిచేయవని తెలిపింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేయనున్నట్లు ఫెడరేషన్ వెల్లడించింది.
భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని జానీ మాస్టర్‌పై ఫెడరేషన్ ఆరోపించింది. నిర్ణయించిన గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!