
క్రీడలు

హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో సోమవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!