30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

Writer: Pooja 08:25 PM, 30 ఆగస్టు, 2026
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 88వ ‘ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో నిర్వహించారు. భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, రెజ్లర్‌ సంగ్రామ్‌ సింగ్‌, నటి మధురిమా తులి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 25,000కుపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా 5,000 మందికి పైగా పాల్గొన్నారు. భారత్‌ సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఈ ఎడిషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మాండవీయ తెలిపారు.

సైక్లింగ్‌ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి అయినా సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. గౌతమ్‌ గంభీర్‌ సైక్లింగ్‌ రైడ్‌ను జెండా ఊపి ప్రారంభిస్తూ.. ఫిట్‌గా ఉన్న దేశమే మరింత బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా ఎదుగుతుందని అన్నారు. బ్రిక్స్‌ దేశాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీబీపీ బ్యాండ్‌ ప్రదర్శనతో స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

ట్యాగ్లు
ఫిట్ ఇండియాసండేస్ ఆన్ సైకిల్మన్సుఖ్ మాండవీయగౌతమ్ గంభీర్బ్రిక్స్ రన్ రైడ్ 2026జాతీయ క్రీడా దినోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌
జనరల్

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...
జనరల్

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం
జనరల్

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ
జనరల్

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
గాసిప్స్

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం
జనరల్

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!