
షోస్

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
98 ఏళ్ల అద్వానీ వయసు రీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది మే నెలలోనూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!