2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

Writer: Chandrika 10:02 AM, 2 సెప్టెంబర్, 2026
పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన యువ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయికృష్ణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాడిపోషణ, వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని సైన్‌మెరీస్‌ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన అదే ఏడాది మణికొండలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో యూఎస్‌ ట్యాక్స్‌ అనలిస్టుగా ఉద్యోగంలో చేరారు. కరోనా సమయంలో 2020లో స్వగ్రామానికి వచ్చిన ఆయన అప్పటి నుంచి వర్క్‌ఫ్రం హోం విధానంలో రాత్రివేళల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు సుమారు రూ.60 వేలు సంపాదిస్తున్నారు. మిగిలిన సమయాన్ని వృథా చేయకుండా కుటుంబానికి చెందిన 40 ఎకరాల భూమిలో వ్యవసాయంతోపాటు పాడిపోషణ చేపట్టారు.

పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల బ్యాంకు రుణం పొందిన సాయికృష్ణ.. అదనంగా రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టి 2024లో 15 సెంట్లలో డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు. షెడ్‌ నిర్మాణానికి రూ.9 లక్షలు, 12 హైబ్రీడ్‌ ఆవుల కొనుగోలుకు మరో రూ.9 లక్షలు వెచ్చించారు. ఫాం నిర్వహణ, పరిశుభ్రత కోసం ఇద్దరు కూలీలను నెలకు రూ.20 వేల చొప్పున నియమించుకున్నారు. ఆవుల నుంచి రోజుకు సుమారు 90 లీటర్ల పాలు లభిస్తుండగా.. లీటరుకు రూ.42 చొప్పున స్థానిక డెయిరీకి విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లాభం వస్తోంది. మరోవైపు ఐదు ఎకరాల్లో టమాట, ఆరు ఎకరాల్లో వరి, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. రోజుకు ఐదారు గంటలు పొలంలో పంటల సంరక్షణకు కేటాయిస్తున్నారు. కాలానుగుణంగా ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తూ వ్యవసాయం ద్వారా సుమారు రూ.15 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటూనే వ్యవసాయం, పాడిపోషణ ద్వారా ఆదాయం పెంచుకుంటున్న సాయికృష్ణ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

ట్యాగ్లు
వర్క్‌ఫ్రం హోంసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపాడిపోషణవ్యవసాయంయువ రైతుఎంబీఏ పట్టభద్రుడుపీఎంఈజీపీ పథకంహైబ్రీడ్‌ ఆవులుగ్రామీణ వ్యాపారవేత్తవ్యవసాయ విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!