

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డా. పి. గురు రాజా పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఎన్నారైలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఎన్నారైలు తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని డా. గురు రాజా సూచించారు. బంధువులు, స్నేహితులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని, ఇందుకోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి కేంద్రం వరకు అన్ని స్థాయిల్లో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు మరింత సమర్థంగా అందుతాయని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!