
టెక్నాలజీ

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సోమవారం మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ నవమి సందర్భంగా అమ్మవారిని ఈ విశిష్ట రూపంలో అలంకరిస్తారు. ఎనిమిది భుజాలతో ఆయుధాలను ధరించి, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన రూపమే మహిషాసురమర్దినీ దేవి రూపం. నవదుర్గల్లో ఈ రూపాన్ని అత్యుగ్రరూపంగా పరిగణిస్తారు.
ఈ రోజున కనకదుర్గమ్మ లేతరంగు దుస్తులు ధరించి, సింహవాహనంపై కొలువుదీరి మహాశక్తి స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మహిషాసురమర్దినీ దేవికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. శరన్నవరాత్రుల్లో ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!