

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరట కలిగించనుంది. ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం రెండు విడతల్లో చేపట్టనుండగా, ఇప్పటికే 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన 2 వేల పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, 5 వేల పోలీస్ ఉద్యోగాల్లో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 148 సివిల్ ఎస్సై, ఇతర విభాగాలకు చెందిన పలు పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత హోంశాఖలో ఇది నాలుగో అతిపెద్ద నోటిఫికేషన్ కావడం విశేషం. గతంలో 2015, 2018, 2022 సంవత్సరాల్లో భారీగా నియామకాలు జరగగా, ఇప్పుడు రానున్న నోటిఫికేషన్ అభ్యర్థులకు మరో సువర్ణావకాశంగా మారనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!