4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

Writer: Chandrika 10:26 AM, 4 సెప్టెంబర్, 2026
గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

గుంటూరుకు చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 28 ఏళ్ల యువకుడు మాయమాటలతో బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా స్థావరాలు మారుస్తూ పలు రాష్ట్రాల్లో తిరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. బాలిక ఆచూకీ కనిపెట్టడంలో జాప్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చారు. పదో తరగతి చదువుతున్న బాలిక జూన్‌ 9న ట్యూషన్‌ నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు నిర్వహిస్తున్న దుకాణానికి వెళ్తున్నానని అమ్మమ్మకు చెప్పి బయటకు వెళ్లింది. ఇంటి నుంచి నగదు, బంగారం తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తిరిగి రాకపోవడంతో మరుసటి రోజు తండ్రి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో పర్చూరుకు చెందిన షేక్‌ జాన్‌సైదా ఆమెను బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు.

బాలికను గుర్తించేందుకు పోలీసులు పర్చూరు, నెల్లూరు, కోయంబత్తూరు, కేరళలోని పాలక్కాడ్‌ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, లాడ్జిల్లో సేకరించిన సమాచారంతో వారి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాలక్కాడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు రైలులో వచ్చినట్లు, అక్కడి నుంచి బేగంపేట రైల్వేస్టేషన్‌ చేరుకుని ఆటోలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నగదు వినియోగిస్తూ ఆన్‌లైన్‌ చెల్లింపులకు దూరంగా ఉంటున్నట్లు, ఇప్పటికే పలుమార్లు సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాలిక తల్లిదండ్రులను సవాలు చేసినట్లు సమాచారం. సాంకేతిక నిపుణుల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఈ ఘటనకు మతపరమైన రంగు పులమవద్దని, వదంతులు వ్యాప్తి చేయవద్దని పోలీసులు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

ట్యాగ్లు
గుంటూరు బాలిక కిడ్నాప్‌గుంటూరు పోలీసులుబాలిక అదృశ్యంఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంకిడ్నాప్‌ కేసుగుంటూరు ఎస్పీసిట్‌ దర్యాప్తుఆంధ్రప్రదేశ్‌ పోలీసులుసీసీటీవీ దర్యాప్తుక్రైమ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు
జనరల్

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!