
గాసిప్స్

తెలంగాణలో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు సమాచారం. ప్రజలు వాతావరణశాఖ తాజా సూచనలను గమనిస్తూ, భారీ వర్షాలు లేదా ఈదురుగాలులు వీచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!