

తమిళనాడులోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మెట్టుపాళయం–ఊటీ మార్గంలో సుమారు 10 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో కేరళానికి చెందిన 150 మందికి పైగా విద్యార్థులు చిక్కుకుపోగా, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. కొండచరియలు పలుచోట్ల విరిగిపడటంతో వాహనాల రాకపోకలు కష్టంగా మారాయి.
మరోవైపు, బర్లియార్ సమీపంలో ఓ ప్రభుత్వ బస్సుపై చెట్టు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. నిరంతర వర్షాల కారణంగా దిండిగల్ జిల్లాలోని అడక్కం గ్రామంలో రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, సహాయక సిబ్బంది పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టగా, దెబ్బతిన్న రహదారులు, కొండచరియల కారణంగా ప్రయాణికులకు అంతరాయం కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!