
జనరల్

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నగరంలోని ఇందిరా గాంధీ స్క్వేర్, రాజీవ్ గాంధీ స్క్వేర్, శివాజీ విగ్రహం జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పుదుచ్చేరి ఓడరేవులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు, రెస్క్యూ బృందాలు అప్రమత్తమై సహాయక, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణాలను వీలైనంత వరకు నివారించాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!