
జనరల్

మెడికవర్ హాస్పిటల్స్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలను ప్రచురించరాదని ఆంక్షలు విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురించిన కథనాలను తిరిగి ప్రచురించకూడదని ఆదేశించింది. సహృదయ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (మెడికవర్ హాస్పిటల్స్) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మన్నె క్రిశాంక్, హరీష్ రెడ్డి, శంకర్ గౌడ్తో పాటు సంబంధిత మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రతివాదులు తమ వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల్లో నిజానిజాలు నిర్ధారించకుండా తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మెడికవర్ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!