
జనరల్

హైదరాబాద్‌లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్‌కు సంబంధించిన హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా, హిందూ సంఘాల ప్రతినిధులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన అనంతరం సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విద్యార్థి తండ్రి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిస్తూ ఘటనపై విచారణ చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!