22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. నాలుగు పక్షులను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

Writer: Harika S 03:18 PM, 22 అక్టోబర్, 2026
దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. నాలుగు పక్షులను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను ఇనుప బోనుల్లో బంధించిన ఘటనలపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. పౌరుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మొత్తం నాలుగు పాలపిట్టలను ప్రాణాలతో కాపాడినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ సమీప ఆలయం వద్ద రెండు పాలపిట్టలను బోనుల నుంచి విడిపించారు. వాటిని కేబీఆర్ పార్క్‌కు సంబంధించిన అటవీ అధికారులకు అప్పగించారు. ఛత్రినాకలోని శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం సమీపంలో చెట్టుకు వేలాడదీసిన బోనులో ఉన్న మరో పాలపిట్టను, మంగళహాట్‌లోని బాలాజీనగర్ ఆలయం సమీపంలో బంధించిన ఇంకో పాలపిట్టను కూడా పోలీసులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు.

పండుగ పేరుతో మూగప్రాణులను బంధించడం, వాటి స్వేచ్ఛను హరించి డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించడం అమానవీయమని సజ్జనర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దని ప్రజలకు సూచించారు. వన్యప్రాణులకు హాని కలిగించే ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం 1800 425 5364, 9803338666 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా డయల్ 112కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. పండుగలను బాధ్యతాయుతంగా జరుపుకుంటూ పక్షులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛను కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

వికసిత్ భారత్ సాధనకు సమష్టి కృషి అవసరం - వెంకయ్య నాయుడు

పవన్ కళ్యాణ్ పై ఫేక్ న్యూస్...తప్పు ఒప్పుకున్న వాట్సాప్ అడ్మిన్

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుపాలపిట్టతెలంగాణ రాష్ట్ర పక్షిసజ్జనర్దసరావన్యప్రాణుల రక్షణజంతు సంరక్షణఅటవీ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
జనరల్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు
జనరల్

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం
జనరల్

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స
రాజకీయాలు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..
జనరల్

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను
జనరల్

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు
రాజకీయాలు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవికి స్వర్ణం
క్రీడలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!