

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని తేజస్వినగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 23న 26 ఏళ్ల రోహిత్ రెడ్డి తన ఇంట్లో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గతంలో వీసా కోసం దరఖాస్తు చేసుకోగా నిరాకరణ ఎదురైంది. రెండోసారి వీసా కోసం ఎదురుచూస్తున్న ఆయన, వీసా వస్తుందా లేదా అనే విషయంపై తల్లిదండ్రులతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
వీసా విషయంలో నెలకొన్న అనిశ్చితి ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అయితే, యువకుడి మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ మృతితో ఆయన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!