
జనరల్

సంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ పరిధిలోని ఖానామేట్ గ్రామంలో ఆక్రమణల చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.400 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రెవెన్యూ అధికారులు హైడ్రాకు విజ్ఞప్తి చేయడంతో ఈ చర్య చేపట్టారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం అధికారులు రంగంలోకి దిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఆక్రమణలు జరగకుండా భూమి చుట్టూ బ్లూషీట్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులను అక్రమ ఆక్రమణల నుంచి కాపాడేందుకు హైడ్రా చేపడుతున్న చర్యల్లో ఇది మరో కీలక పరిణామంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!