
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) కీలక సూచనలు చేసింది. ఎంబీబీఎస్ ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఫేజ్-1లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ దశల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేసి, గడువు ముగిసేలోపు వాటిని తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ సూచించింది. తాము నిజంగా చేరాలనుకునే మెడికల్ కాలేజీలను మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని తెలిపింది. వెబ్ ఆప్షన్ల నమోదు కోసం అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించాలని అభ్యర్థులకు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!