
జనరల్

వెట్టిచాకిరి లేదా బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, కొత్త నిబంధనలు 30 రోజుల్లో అమల్లోకి రానున్నాయి.
దిగుమతి విధానాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు నైతిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. బలవంతపు శ్రమతో తయారైన ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి రాకుండా నిరోధించడమే కాకుండా, అంతర్జాతీయ కార్మిక హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య విధానాలను బలోపేతం చేయడంపై ఈ చర్య దృష్టి సారించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!