

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
ఈ నెల 25 నుంచి 30 మధ్య హైదరాబాద్లో సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. సభకు సుమారు లక్ష మందిని సమీకరించే అంశంపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరుకానున్న నేపథ్యంలో సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!