15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్

Writer: Shivani K 02:15 PM, 15 అక్టోబర్, 2026
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముకని, వారి అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు దివంగత మండవ వెంకట్రామయ్య వ్యవసాయ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గురువారం నిర్వహించిన మండవ వెంకట్రామయ్య స్మారక కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి, మండవ వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాణ్యత, విశ్వసనీయత, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ విత్తన రంగంలో మండవ వెంకట్రామయ్య విశేష కృషి చేశారని, ఆయన దూరదృష్టి వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపిందని గవర్నర్ పేర్కొన్నారు.

రైతుల శ్రమ, అంకితభావం, పట్టుదల దేశంలో ఆహార భద్రతకు పునాది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతోపాటు రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మండవ వెంకట్రామయ్య ఆశయాలను కొనసాగిస్తూ నూజివీడు సీడ్స్ సంస్థ వ్యవసాయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది, జ్ఞానం, కఠోర శ్రమ, నిజాయితీతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ప్రభాకరరావు, మండవ కుటుంబ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

భారత్‌లో 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారా? అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి ఆందోళన

భారత్‌లో 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారా? అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి ఆందోళన

సీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం..

సీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం..

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ట్యాగ్లు
తెలంగాణ గవర్నర్శివప్రతాప్ శుక్లానూజివీడు సీడ్స్మండవ వెంకట్రామయ్యరైతుల సంక్షేమంవ్యవసాయ రంగంవిత్తన రంగంవ్యవసాయ పరిశోధనలునూతన ఆవిష్కరణలుఆహార భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..
బిజినెస్

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా
జనరల్

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
జనరల్

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
రాజకీయాలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
రాజకీయాలు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!
షోస్

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు
రాజకీయాలు

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం
రాజకీయాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..
జనరల్

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!