

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రసిద్ధ శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కోనేరులోకి మురికినీరు చేరుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే, కోనేరు నిర్మాణం మరింత పటిష్టంగా ఉండేందుకు గ్రౌటింగ్ పనులు నిర్వహిస్తున్నారు.
మురికినీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, కోనేరు సుందరీకరణ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. తాత్కాలిక పరిష్కారాలకు పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత కోనేరును పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యం. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!