
క్రీడలు

కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. ప్రజల గొడవే తన గొడవగా భావించి జీవితాన్ని సాగించిన మహనీయుడు కాళోజీ అని కేటీఆర్ కొనియాడారు. నిరంకుశత్వం, అణచివేతకు వ్యతిరేకంగా తన రచనలు, ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవిగా కాళోజీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భాష బడి పలుకుల భాష మాత్రమే కాదని, ప్రజల జీవన విధానంలో భాగమైన పలుకుబడుల భాష అని కాళోజీ చాటిచెప్పారని అన్నారు. కాళోజీ జయంతిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భాష, సంస్కృతి కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!