30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

Writer: Pooja 11:11 PM, 30 ఆగస్టు, 2026
రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’ ద్వారా తన రాజకీయ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సొంత జిల్లా నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించనున్న కవిత.. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘పాంచజన్యం’ను పార్టీ ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణవాదులు, ఉద్యమకారులు, నిజామాబాద్‌తో అనుబంధం ఉన్న నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సామాజిక న్యాయం, సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారతే తమ రాజకీయ దిశగా పేర్కొంటున్న ఆమె రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందూరు సభను ఈ రాజకీయ ప్రయాణానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

సభలో కవిత పలు కీలక విధానాలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమకారులకు సూపర్‌న్యూమరరీ పోస్టులు, యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ హామీతో రుణాలు వంటి ప్రతిపాదనలను వివరించనున్నట్లు చెబుతున్నారు. రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతపై తమ భవిష్యత్‌ ప్రణాళికను కూడా ఈ సభ వేదికగా వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

సైప్రస్‌ తీరంలో ప్రయాణికుల ఫెర్రీ బోల్తా

సైప్రస్‌ తీరంలో ప్రయాణికుల ఫెర్రీ బోల్తా

మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు

మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేననిజామాబాద్ రాజకీయాలుపాంచజన్య సభతెలంగాణ రాజకీయాలురాజకీయ పునరేకీకరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం
గాసిప్స్

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

చిన్న సినిమా...భారీ వసూళ్లు
సినిమాలు

చిన్న సినిమా...భారీ వసూళ్లు

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత
గాసిప్స్

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ
జనరల్

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి
బిజినెస్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత
సినిమాలు

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు
క్రీడలు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!