

సన్ టీవీ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న కావ్య మారన్ పేరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్తో ఆమె వివాహం జరగనుంది. నవంబర్ 11న గ్రీస్లో పెళ్లి, నవంబర్ 21న చెన్నైలో విందు ఉంటాయని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కళానిధి మారన్ దంపతులు కలిసిన చిత్రాలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.
హురూన్ సంపన్నుల జాబితా 2026 ప్రకారం కళానిధి మారన్ ఆస్తుల విలువ సుమారు రూ.24,600 కోట్లుగా అంచనా. సన్ టీవీ నెట్వర్క్తోపాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోనూ ఆయన కుటుంబానికి కీలక పాత్ర ఉంది. కావ్య మారన్ లండన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తిచేసి, 2019లో సన్ టీవీ నెట్వర్క్లో బాధ్యతలు చేపట్టారు. ఆమె వ్యక్తిగత ఆస్తులు సుమారు రూ.409 కోట్లని ప్రచారం. మరోవైపు అనిరుధ్ ఆస్తుల విలువ రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెళ్లి వార్తలకంటే ఈ ఆర్థిక వివరాలే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!