
జనరల్

కేరళ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, Left Democratic Front (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వానికి ఈసారి గట్టి ఎదురుగాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని కూటమికి వ్యతిరేకంగా, United Democratic Front (యూడీఎఫ్), కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెజారిటీ దక్కే అవకాశముందని సర్వే సంస్థలు వెల్లడించాయి. అలాగే భాజపా కూడా కొన్ని స్థానాల్లో ఖాతా తెరవొచ్చని అంచనా వేస్తున్నాయి.
ఏప్రిల్ 9న 140 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతుండగా, 2021లో ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి గెలిచింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ మంచి ప్రదర్శన చూపగా, అదే ధోరణి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపించవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. తుది ఫలితాలు మే 4న వెల్లడించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!