

తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో రాత్రికి రాత్రే తొలగించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విగ్రహం తొలగింపు ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెప్పు కోసం పోలీసులు వ్యవహరించవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు.
విగ్రహ తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అరెస్టు చేసిన వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మరింత ఇబ్బంది కలిగించే చర్యలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!