
జనరల్

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు, హింసాత్మక ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. ఫ్రాన్స్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. ఆ దేశం విప్లవాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమంటూ వ్యాఖ్యానించారు. “మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. అక్కడ విప్లవంలో పాల్గొందాం” అంటూ సెటైర్లు వేశారు.
అమెరికన్లకు 5,000 డాలర్ల చెల్లింపు అందితే ఫ్రాన్స్‌కు వెళ్లొచ్చనే ఊహాత్మక సందర్భాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం పెరుగుదల, ప్రభుత్వ సేవలపై అసంతృప్తి, విద్యా రంగ సమస్యలకు వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!