15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

Writer: Chandrika 06:58 AM, 15 అక్టోబర్, 2026
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనుండగా, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఒకే దశలో నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో జరపనున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం 100 చోట్ల మాత్రమే ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు మరో 19 పురపాలక సంఘాలకు డిసెంబరులో ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

మున్సిపల్‌ ఎన్నికలకు అక్టోబరు 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబరు 28న పోలింగ్‌, అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ), విజయవాడ నగరపాలక సంస్థలకు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేయగా, మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా 11 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. మొత్తం 9,983 ఎంపీటీసీ, 662 జడ్పీటీసీ స్థానాలకు అక్టోబరు 21 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబరు 5న ఫలితాలు వెల్లడిస్తారు. అలాగే 13,185 గ్రామ పంచాయతీలకు నవంబరు 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్‌ జరగనుంది. ప్రతి విడతలోనూ పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. సంబంధిత పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఎన్నికల అధికారులు శుక్రవారం స్థానికంగా ఎన్నికల నోటీసులు జారీ చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!

ట్యాగ్లు
స్థానిక సంస్థల ఎన్నికలుమున్సిపల్‌ ఎన్నికలురాష్ట్ర ఎన్నికల సంఘంనగరపాలక సంస్థలుపురపాలక సంఘాలుఎంపీటీసీ ఎన్నికలుజడ్పీటీసీ ఎన్నికలుగ్రామ పంచాయతీ ఎన్నికలుఎన్నికల నోటిఫికేషన్‌ఎన్నికల ప్రవర్తనా నియమావళి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముంబై కోర్టు నో
జనరల్

కెప్టెన్సీ బాధ్యత కొత్త సవాల్ కాదన్న స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ బాధ్యత కొత్త సవాల్ కాదన్న స్మృతి మంధాన

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!
టెక్నాలజీ

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ
రాజకీయాలు

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు
జనరల్

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌
రాజకీయాలు

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..
రాజకీయాలు

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?
జనరల్

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!
జనరల్

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!