

తమిళనాడు, కేరళం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా నేడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందకూడదని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!