24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాయలసీమకు భారీ పెట్టుబడులు

Writer: Nithish 07:54 AM, 24 అక్టోబర్, 2026
రాయలసీమకు భారీ పెట్టుబడులు

రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక తయారీ కేంద్రంగా, గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు, ఆహార శుద్ధి, వస్త్రాలు, ఆతిథ్య రంగాల్లో రూ.5,217.39 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో 23 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 7,613 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతపురంలోని జేఎన్‌టీయూలో శుక్రవారం ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని పారిశ్రామిక అవకాశాలపై సదస్సులో చర్చించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో కియా ప్లాంట్ పరిసరాల్లో ఆటోమొబైల్ విడిభాగాల తయారీకి హ్వాసిన్ ఆటోమోటివ్ రూ.850 కోట్లు, ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీకి సియోయాన్ రూ.514 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కర్నూలులో ఇవామెట్ ఇండియా రూ.250 కోట్లతో విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ అభివృద్ధి, ఏరోస్పేస్ కాంప్లెక్స్, రక్షణ పరికరాలు, డ్రోన్ తయారీ ప్రాజెక్టులతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. చిత్తూరులో నకోడా డెయిరీ రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించనుంది. శ్రీసత్యసాయి జిల్లాలో వస్త్ర పరిశ్రమలు, అనంతపురం, కడపలో హోటళ్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో కుదిరిన పారిశ్రామిక ఒప్పందాల్లో 70 శాతానికి పైగా అమలు దశలో ఉన్నాయని ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. గత రెండేళ్లలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, వాటిలో రూ.16.16 లక్షల కోట్లు కేటాయింపుల స్థాయికి చేరాయని ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

తిరుమలలో భారీ రద్దీ

తిరుమలలో భారీ రద్దీ

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగుస్తుంది: ట్రంప్‌

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగుస్తుంది: ట్రంప్‌

ఆధునిక టెర్మినల్‌.. కనెక్టివిటీ కరువు.. చర్లపల్లిలో ప్రయాణికుల అవస్థలు

ఆధునిక టెర్మినల్‌.. కనెక్టివిటీ కరువు.. చర్లపల్లిలో ప్రయాణికుల అవస్థలు

రష్యాను ఓడించే శక్తి ఐరోపాకు లేదు: పుతిన్

రష్యాను ఓడించే శక్తి ఐరోపాకు లేదు: పుతిన్

ట్యాగ్లు
రాయలసీమ అభివృద్ధిఏపీ పెట్టుబడులుపారిశ్రామిక ఒప్పందాలుఉద్యోగ అవకాశాలుఆటోమొబైల్ పరిశ్రమలుఏరోస్పేస్ రంగండ్రోన్ సిటీఉక్కు పరిశ్రమలుగ్లోబల్ హార్టికల్చర్ హబ్ఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్
జనరల్

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన
జనరల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

తిరుమలలో భారీ రద్దీ
జనరల్

తిరుమలలో భారీ రద్దీ

రాయలసీమకు భారీ పెట్టుబడులు
జనరల్

రాయలసీమకు భారీ పెట్టుబడులు

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి
బిజినెస్

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగుస్తుంది: ట్రంప్‌
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగుస్తుంది: ట్రంప్‌

ఆధునిక టెర్మినల్‌.. కనెక్టివిటీ కరువు.. చర్లపల్లిలో ప్రయాణికుల అవస్థలు
జనరల్

ఆధునిక టెర్మినల్‌.. కనెక్టివిటీ కరువు.. చర్లపల్లిలో ప్రయాణికుల అవస్థలు

రష్యాను ఓడించే శక్తి ఐరోపాకు లేదు: పుతిన్
జనరల్

రష్యాను ఓడించే శక్తి ఐరోపాకు లేదు: పుతిన్

ఐరోపాలో తీవ్ర వడగాలులు
జనరల్

ఐరోపాలో తీవ్ర వడగాలులు

విభజనవాద శక్తులకు వ్యతిరేకంగా సమాజం ఏకం కావాలి: మోదీ
జనరల్

విభజనవాద శక్తులకు వ్యతిరేకంగా సమాజం ఏకం కావాలి: మోదీ

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!