
సినిమాలు

బీజేపీ నేత అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018లో నమోదైన ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది.
ఈ కేసులో 2026 అక్టోబర్ 6న వాదనలు ప్రారంభం కాగా, అక్టోబర్ 12న ముగిశాయి. అనంతరం కోర్టు తీర్పును వెల్లడించింది. తీర్పు వెలువడిన రోజున రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడంతో ఈ కేసులో ఆయనకు ఊరట లభించినట్లయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!