

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో పూజారిగా పనిచేస్తున్న శారద కృష్ణ (60) మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన గత కొన్నేళ్లుగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పరిశ్రమ ప్రాంగణంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం శారద కృష్ణ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై మేడ్చల్ వైపు వెళ్తుండగా డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలోని పంజాబీ దాబా వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!