
క్రీడలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పరపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న పలు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు అప్రమత్తమయ్యారు. అయితే వరుసగా కార్లు ఢీకొనడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ కారణంగా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గాయపడిన వారి పరిస్థితి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చేపట్టిన చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!