

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం ఆకుల వానీ గురువులో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గ MRPS ఇన్‌చార్జి ఉండ్రాజవరపు శేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MRPS మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కాకినాడ జిల్లా ఇన్‌చార్జి పసుపులేటి చిన్నిబాబు మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతి అభివృద్ధిలో MSF కీలక పాత్ర పోషించాలని కోరారు. వివిధ ఉద్యమాల్లో విద్యార్థులు కీలకంగా వ్యవహరించి విజయాలు సాధించారని పేర్కొంటూ, విద్యార్థులు సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో MSF నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ అధ్యక్షుడిగా తెన్నేటి జస్వంత్ మాదిగ, గ్రామస్థాయి ప్రతినిధిగా సెట్టెం సన్నీ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఆకుమర్తి అరవింద్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా తెన్నేటి డేవిడ్ రాజు మాదిగ, కోశాధికారిగా ఖండవల్లి జగదీష్ మాదిగ, కార్యదర్శులుగా సిరా దీనిదయ మాదిగ, సిరా రూబేను మాదిగ, సిరా విజయ ప్రతాప్ మాదిగలను నియమించారు. ఉపాధ్యక్షులుగా ఆకుమర్తి కిషోర్ మాదిగ, ముస్కుడి షడ్రక్ మాదిగల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో MRPS సీనియర్ నాయకుడు తెన్నేటి శ్రీను మాదిగ, తెన్నేటి అలెగ్జాండర్ మాదిగ, సనమండ శాస్త్రి మాదిగ, బి. దుర్గ ప్రసాద్ మాదిగ, తెన్నేటి శేఖర్ మాదిగ, తెన్నేటి సంతోష్ మాదిగ, ఆకుమర్తి అఖిల్ మాదిగతో పాటు MRPS, MSP, MSF అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!