
బిజినెస్

నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ కళాశాలలో జరిగిన ఘటనకు సంబంధించి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాకేత్‌కు చెందిన కంపెనీలో పనిచేస్తున్న ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో లైటింగ్ పోల్‌కు సరైన సపోర్టు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనలో భద్రతా ఏర్పాట్ల లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ పరిశీలన జరుగుతోంది.
ఈ ఘటనకు సంబంధించి ఎంవీఎస్‌ఆర్ కళాశాల మేనేజ్‌మెంట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఈవెంట్ నిర్వహణలో పాల్గొన్నవారి బాధ్యతలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!