

పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంక్ డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాలో నిల్వ చేసిన తమ బంగారంలో నుంచి సుమారు 86 టన్నులను 2026 మార్చి నుంచి ఆగస్టు మధ్య లండన్‌కు తరలించింది. సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని వేగంగా వినియోగించుకునేందుకు, దాని ట్రేడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ చర్య చేపట్టినట్లు DNB వెల్లడించింది.
ఈ క్లిష్టమైన తరలింపును భౌతిక రవాణా, మార్కెట్ లావాదేవీల కలయికతో పూర్తి చేశారు. 27 టన్నులకు పైగా బంగారాన్ని ఉత్తర అమెరికా నుంచి నెదర్లాండ్స్‌లోని జీస్ట్‌లో ఉన్న DNB కేంద్రానికి తరలించి, అదే స్థాయిలో బంగారాన్ని అక్కడి నుంచి లండన్‌కు పంపించారు. మరోవైపు, కొంత బంగారాన్ని న్యూయార్క్‌లో విక్రయించి, సమాన పరిమాణంలో లండన్‌లో కొనుగోలు చేశారు. భౌతిక బంగారం ట్రేడింగ్‌కు లండన్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో, అక్కడి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నిల్వ చేస్తే సంక్షోభ సమయంలో బంగారాన్ని త్వరగా ట్రేడ్ చేయడం, వినియోగించడం సులభమవుతుందని DNB పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!