9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

Writer: Nithish 10:29 PM, 9 సెప్టెంబర్, 2026
హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావుపై బహిరంగంగా ‘బ్లాక్ మ్యాజిక్’, ‘క్షుద్రపూజలు’ చేశారంటూ ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పేర్కొంటూ న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. కేసు నంబర్ 776/36/2/2026 కింద ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్.. నాలుగు వారాల్లోగా తీసుకున్న చర్యలపై ఆంగ్లంలో ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాలని తెలంగాణ డీజీపీని సెప్టెంబర్ 9న ఆదేశించినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. హరీశ్‌రావు అనుమతితో, ఆయన తరఫున కారుపోతుల రేవంత్ ఆగస్టు 22న మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12(ఏ) కింద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

జూలై 31 నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హరీశ్‌రావు వర్షాలు ఆగిపోవడానికి, కరువు రావడానికి ఆలయాల్లో తాంత్రిక పూజలు చేయించారంటూ బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆలయ రికార్డులు, పూజారులు, రసీదులు లేదా సాక్ష్యాలు వెల్లడించలేదని తెలిపారు. ఆగస్టు 4న ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ, ఆగస్టు 17న డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆరోపించారు. క్షుద్రపూజల వల్ల వర్షాలు ఆగుతాయనే వ్యాఖ్యలు ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే ప్రమాదం ఉందని, ‘చేతబడి’ ఆరోపణలతో మహిళలు, వితంతువులు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడుల ముప్పు పెరుగుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు లేకపోవడమే ఫిర్యాదుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

ట్యాగ్లు
హరీశ్ రావుక్షుద్రపూజలుబ్లాక్ మ్యాజిక్ఎన్‌హెచ్‌ఆర్‌సీతెలంగాణ డీజీపీకారుపోతుల రేవంత్సిద్దిపేట ఎమ్మెల్యేబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుమానవ హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!