

ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980s ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 1980s పేరుతో నకిలీ యాప్‌లను రూపొందించి, వాటి ఏపీకే ఫైళ్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ట్రెండ్‌ను అనుసరిస్తున్న నెటిజన్లు వాటిని నిజమైన యాప్‌లుగా భావించి డౌన్‌లోడ్ చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫొటో ఎడిటింగ్ కోసం ప్రత్యామ్నాయ యాప్‌లను వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫేక్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఇతర సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఏపీకే ఫైల్‌ను నమ్మి డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం, గుర్తు తెలియని యాప్‌లకు ఫోన్ అనుమతులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ట్రెండ్ పేరుతో వచ్చే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు వాటి మూలం, విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!